బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ని పరామర్శించిన తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు.

బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ని తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు..

ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకున్న గవర్నర్ దంపతులు కేసీఆర్ తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి వివరాలు తెలుసుకున్నారు…
త్వరలో పూర్తిస్థాయి లో కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

కాసేపు కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితర కుటుంబ సభ్యులతో వారు ఇష్టాగోష్టి జరిపారు.

ఈ సందర్భంగా నందినగర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులను తొలుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె. తారకరామారావు సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

నూతన తెలంగాణ రాష్ట్రం లో జరిగిన అభివృద్ధి.. ఈ క్రమంలో గవర్నర్ హోదాలో నాడు నరసింహన్ అందించిన సంపూర్ణ సహకారం చర్చకు వచ్చిన సందర్భంలో, వారి సహకారానికి తెలంగాణ తొలిముఖ్యమంత్రి గా కేసీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

తమ నివాసానికి వచ్చిన అతిథులను కేసీఆర్ దంపతులు నిండుమనసుతో సత్కరించారు. వారికి పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్దతిలో అతిథి మర్యాదలు చేసారు. కేసీఆర్ దంపతులు చూయించిన ప్రేమాభిమానాలకు వారు అభినందనలు తెలిపారు.