తెలంగాణ బడ్జెట్ 2022-2023….. బడ్జెట్ హైలెట్స్….LIVE UPDATE…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభలోకి ప్రవేశించారు. రాజ్యాంగము బుక్ తో సభ లోకి భట్టి విక్రమార్క ప్రవేశించారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు…
అసెంబ్లీలో 2022 ,2023 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. రూ. 2,56,958.51 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు మంత్రి హరీశ్.
*తెలంగాణ బడ్జెట్ 2,56,958.51 కోట్లు.

*వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు*

*ఆసరా పెన్షన్లకు 11728 కోట్లు*

*కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కు 2750 కోట్లు*

*డబుల్ బెడ్రూమ్ ల కోసం 12000 కోట్లు*

*దళితబంధు 17వేల 7వందల కోట్లు.*

*మన ఊరు- మన బడి 7289 కోట్లు.*

*ఎస్టీల సంక్షేమం కోసం 12565 కోట్లు*

*పట్టణ ప్రగతి కోసం 1394 కోట్లు*

*బిసి సంక్షేమం కోసం 5698కోట్లు*

*బ్రాహ్మణుల సంక్షేమం కోసం 177 కోట్లు*

*పల్లె ప్రగతి 3330 కోట్లు*

*ఫారెస్ట్ యూనివర్సిటీకి 100 కోట్లు*

*హరితహారంకు 932 కోట్లు*

*రోడ్లు, భవనాల కోసం 1542 కోట్లు*..

*తెలంగాణ బడ్జెట్ 2,56,958.51 కోట్లు*

*వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు*

*ఆసరా పెన్షన్లకు 11728 కోట్లు*

*కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కు 2750 కోట్లు*

*డబుల్ బెడ్రూమ్ ల కోసం 12000 కోట్లు*

*దళితబంధు 17వేల 7వందల కోట్లు.*

*మన ఊరు- మన బడి 7289 కోట్లు.*

*ఎస్టీల సంక్షేమం కోసం 12565 కోట్లు*

*పట్టణ ప్రగతి కోసం 1394 కోట్లు*

*బిసి సంక్షేమం కోసం 5698కోట్లు*

*బ్రాహ్మణుల సంక్షేమం కోసం 177 కోట్లు*

*పల్లె ప్రగతి 3330 కోట్లు*

*ఫారెస్ట్ యూనివర్సిటీకి 100 కోట్లు*

*హరితహారంకు 932 కోట్లు*

*రోడ్లు, భవనాల కోసం 1542 కోట్లు*

తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు స‌స్పెండ్..

తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ చేశారు. బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డుప‌డుతున్న ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావును సస్పెండ్ చేశారు. స‌భ ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు….స‌స్పెండ్ చేసిన టీఆర్ఎస్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా వారు కేసీఆర్ స‌ర్కారు తీరును నిర‌సిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత ముగ్గురు ఎమ్మెల్యేల‌ను బొల్లారం పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు..

అసెంబ్లీలో స్పీక‌ర్‌తో సీఎం కేసీఆర్ భేటీ...

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద‌యం 11 గంట‌ల‌కు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ కార్య‌ద‌ర్శి న‌ర‌సింహాచార్యులు సీఎం కేసీఆర్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం క‌లిశారు. సీఎం వెంట మంత్రులు హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

*హైదరాబాద్*

నల్లకండువాలతో అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజా సింగ్ ,రఘునందన్ రావు…

తెలంగాణ‌ భ‌వ‌న నిర్మాణ రంగ కార్మికుల‌కు శుభ‌వార్త‌..

రాష్ట్ర వ్యాప్తంగా భ‌వ‌న నిర్మాణ రంగంలో ప‌ని చేస్తున్న కార్మికుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. కార్మికుల కోసం స‌రికొత్త ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. మొద‌టి విడుత‌లో భాగంగా భ‌వ‌న నిర్మాణ రంగంలోని ప‌ని చేస్తున్న ల‌క్ష మందికి స‌బ్సిడీపై మోటార్ సైకిళ్ల‌ను అంద‌జేయాల‌ని సీఎం కేసీఆర్ సంక‌ల్పించిన‌ట్లు హ‌రీశ్‌రావు పేర్కొన్నారు…

గ్రేటర్ హైదరాబాద్‌కు అగ్రతాంబూలం

గ్రేటర్ హైదరాబాద్‌కు అగ్రతాంబూలం దక్కింది. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల మరమ్మతు పనులు రూ.858 కోట్లు కేటాయించారు. ఓఆర్ఆర్ చుట్టూ రూ.387 కోట్లతో సర్వీసు రోడ్డు నిర్మాణానికి కేటాయించారు. రూ.36.5 కోట్లతో గండిపేట చెరువు అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. రూ.1450 కోట్లతో సుంకిశాల నుంచి క్రిష్ణా జలాలకు హైదరాబాద్‌కు వచ్చే పైపు లైన్‌ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.725 కోట్లు కేటాయిస్తున్నాం. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ కోసం రూ.3,866 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు…