తెలంగాణలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన AICC అధ్యక్షులు “మల్లికార్జున్ ఖర్గే”, “రాహుల్ గాంధీ”…

*తెలంగాణలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన AICC అధ్యక్షులు “మల్లికార్జున్ ఖర్గే”, “రాహుల్ గాంధీ”..*

అసెంబ్లీ పార్లమెంటు పంచాయతీ మున్సిపల్ సహా అన్ని ఎన్నికల ఫలితాలను వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముఖ్యమంత్రి నాయకత్వంలో సమిష్టిగా పనిచేశామన్న మంత్రులు..

తమకు ముఖ్యమంత్రి పూర్తి పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిచ్చి మద్దతుగా ఉంటున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన కొందరు మంత్రులు..

తెలంగాణలో అభివృద్ధి అంశాలు శాఖల వారీగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలు అమలుచేస్తున్న పథకాలపైన ఆరా తీసిన ఖర్గే, రాహుల్ గాంధీ.

టీం వర్క్ మరింత పెరగాల్సిన అవసరం ఉందన్న ఖర్గే, రాహుల్

చిన్న చిన్న విషయాలు పట్టించుకొని మంత్రులు మనస్పర్ధలు తెచ్చుకోవద్దనీ.. సర్దుకునిపోతూ సమన్వయంతో పనిచేయాలన్న ఇద్దరు నేతలు..

తెలంగాణలో ధాన్యం సేకరణ ఇతర సంబంధిత అంశాలపై వివరించిన ఉత్తంకుమార్ రెడ్డి..

వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న చర్యలు భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందన్న తుమ్మల నాగేశ్వరరావు.

దేశంలో కాదు.. ప్రపంచంలోనే నెంబర్ వన్ గా రావాలన్న రాహుల్ గాంధీ.

సమ్మక్క జాతర నిర్వాణపైన సమావేశంలో సుదీర్ఘ చర్చ

జాతర ప్రాముఖ్యత సంతరించుకోవడానికి దారితీసిన పరిస్థితులు చరిత్ర గురించి తెలుసుకున్న ఖర్గే, రాహుల్ గాంధీ.

సమావేశం అనంతరం మంత్రులతో విడివిడిగా మాట్లాడిన ఖర్గే, రాహుల్ గాంధీ.

కొన్ని ఇతర అంశాలు సమావేశoలో అందరి ముందూ కాకుండా.. విడివిడిగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఖర్గే.