తెలంగాణలో అన్ని రవాణా చెక్ పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం…

బ్రేకింగ్ న్యూస్

*🔹తెలంగాణలో అన్ని రవాణా చెక్ పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం.*

_• సాయంత్రం 5 గంటల్లోగా అన్ని రవాణా శాఖ చెక్ పోస్టులను, ఆఫీసులను మూసివేయాలని ప్రభుత్వం రవాణా శాఖ కమిషనర్ కు ఆదేశాలు._

_•
తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ చెక్‌పోస్టుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం అక్టోబర్ 22న ఆదేశాలు వెలువడ్డాయి. గత ఆదివారం ఆంటీ కరప్షన్ బ్యూరో అధికారులు చెక్‌పోస్టులపై నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా అవినీతి బయటపడింది. .ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపా లను నిలిపివేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చెక్‌పోస్టులను మూసివేయడంతో పాటు, అక్కడి సిబ్బందిని ఇతర చోట్ల వినియోగించుకోవాలి. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (డీటీసీలు) , జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు (డీటీవోలు) తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

.గతంలో వాహనాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే, క్రమక్రమంగా అవి అవినీతికి కేంద్రాలుగా మారాయి. కొంతమంది అధికారులు ప్రైవేట్ సిబ్బందిని ఉపయోగించి అక్రమ వసూళ్లు జరుపుతున్నారని విభాగానికి కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి.

ఇప్పటికే జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత.. చెక్‌పోస్టుల అవసరం చాలా మేరకు తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అనేక రాష్ట్రాలు ఇప్పటికే చెక్‌పోస్టులను రద్దు చేశాయి. తెలంగాణలో మాత్రం కొన్ని అధికారుల ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం ఆలస్యమైంది. సుమారు ఏడాదిన్నర క్రితమే రవాణాశాఖ చెక్‌పోస్టుల రద్దుకు అనుమతి ఇచ్చినా, ఆ జీఓ అమల్లోకి రావడానికి ఇంతసమయం పట్టింది.