తెలంగాణ రాష్ట్రంలో కరెంటు బాధ లేదు నీళ్ల బాధ లేదు: సీఎం కేసీఆర్..

గ‌తంలో వ్య‌వ‌సాయం చేసుకునే కుటుంబాల‌కు, ఆ రైతుల‌కు ఎవ్వ‌రూ పిల్ల‌ను ఇవ్వ‌క‌పోయేటోళ్లు అని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేసీఆర్ అన్నారు.ఇప్పుడు వ్య‌వ‌సాయం చేస్తున్నారా..? భూమి ఉందా? అని అడిగి పిల్ల‌ను ఇస్తున్నార‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు కాగ‌జ్‌న‌గ‌ర్ ఎట్ల ఉండేనో.. తెలంగాణ అట్ల‌నే ఉండే. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ‌టం ర‌క‌ర‌కాల ఇబ్బంది చూశాం. పొట్ట చేత‌ప‌ట్టుకుని వ‌ల‌స‌లు పోయారు. ఈ ప‌దేండ్లలో ఒక‌టి ఒక‌టి బాగు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మంచినీళ్ల స‌మ‌స్య లేదు. సిర్పూర్ గురించి మంచం ప‌ట్టిన మ‌న్యం అని వార్త‌లు వ‌చ్చేవి. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.అన్నారు

తెలంగాణ లో లంబాడీ, ఆదివాసీ గూడెంల‌కు భ‌గీర‌థ నీళ్లు వ‌స్తున్నాయి. క‌రెంట్ బాధ కూడా లేదు. ఇవాళ 24 గంట‌లు క‌రెంట్ ఇచ్చుకుంటున్నాం. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంట‌ల క‌రెంట్ లేదు. అన్ని వ‌ర్గాల‌కు క‌రెంట్ ఇస్తున్న‌ది తెలంగాణ రాష్ట్రం మాత్ర‌మే. ఇలా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకున్నాం. పేద‌ల‌కు అన్ని విధాలుగా ఇప్పుడిప్పుడే అన్ని చేసుకుంటున్నాం.అని అన్నారు.

ఆరోగ్యం దృష్ట్యా కూడా మంచి ప‌నులు చేప‌ట్టాం. గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌లో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహ‌నాలు ఏర్పాటు చేశాం. ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లో ప్ర‌స‌వాలు అవుతున్నాయి. ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌ దోపిడీ త‌గ్గింది అని కేసీఆర్ తెలిపారు.

గురుకుల పిల్ల‌లు ఇంజినీర్లు, డాక్ట‌ర్లు అవుతున్నారు..
విద్యా వ్య‌వ‌స్థ‌ను బాగు చేసుకున్నాం. గురుకుల విద్యాసంస్థ‌లు నెల‌కొల్పాం. కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాం. ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం గురుకులాలు పెట్టుకున్నాం. ఆ పాఠ‌శాల‌లో చ‌దువుకునే విద్యార్థుల మీద ల‌క్షా 20 వేలు ఖ‌ర్చు పెడుతున్నాం. గురుకులాల్లో చ‌దివిన విద్యార్థులు డాక్ట‌ర్లు ,ఇంజినీర్లుగా త‌యార‌వుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇవాళ భూమి విలువ పెరిగింది..
తెలంగాణ అంటేనే వ‌ల‌స పోవుడు. ఇవాళ రైతాంగం బాగుప‌డాల‌ని, వ్య‌వ‌సాయాన్ని స్థీరిక‌రించాల‌ని చాలా మంచి ప‌నులు చేశాం. నాలుగైదు సౌక‌ర్యాలు క‌ల్పించాం. గ‌తంలో రైతుకు పిల్ల‌ను ఇవ్వ‌క‌పోయేటోడు. చివ‌ర‌కు చ‌ప్రాసీ ఉద్యోగం ఉన్న‌వారికి ఇచ్చేవారు. ఇవాళ రైతుకు పిల్ల‌ను ఇస్తున్నారు.

భూమి ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే వ్య‌వ‌సాయం విలువ భూమి విలువ పెరిగింది. నీటి కొరత లేదు. ప్రాజెక్టుల ద్వారా ఇచ్చే నీళ్ల‌కు ట్యాక్స్ లేదు. బ‌కాయిలు ర‌ద్దు చేసుకున్నాం. రైతులు ద‌ర్జాగా వ్య‌వ‌సాయం చేసుకుంటున్నారు. పెట్టుబ‌డికి ఇబ్బంది ఉండొద్ద‌ని రైతుబంధు ఇస్తున్నాం.ఈ ప‌థ‌కం పేద రైతుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది అని సీఎం స్ప‌ష్టం చేశారు.

రైతులు సంతోషంగా ఉన్నారు..
వ‌డ్లు పండితే ఏ ఊరికి ఆ ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నాం. రైతుల‌కు క‌నీస‌ మ‌ద్ద‌తు ధ‌ర‌ ఇస్తున్నాం. ద‌ళారీ రాజ్యం ఉండొద్ద‌ని చెప్పి ధ‌ర‌ణి పోర్ట‌ల్ తెచ్చి రైతుల భూముల‌ను ర‌క్షించాం.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 16 వేల ఎక‌రాల‌కు పోడు ప‌ట్టాలు ఇచ్చాం. గిరిజ‌నులపై ఉన్న కేసులు ఎత్తేశాం. రైతుబంధు ఇచ్చాం. గిరిజ‌నేత‌ర బిడ్డ‌ల‌కు కూడా ప‌ట్టాలు వ‌స్తాయి. దానికి ఆటంకం కేంద్ర ప్ర‌భుత్వ‌మే. క‌ఠిన‌మైన రూల్స్ పెట్టారు.

లెక్క‌లు తీసి కేంద్రానికి పంపించాం. ఎన్నిక‌ల త‌ర్వాత పోరాటం చేసి గిరిజ‌నేత‌రుల‌కు కూడా ప‌ట్టాలు ఇచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటాం. మొత్తానికి ఇవాళ రైతుల‌ ముఖాలు తెల్ల‌ప‌డ్దాయి. అప్పులు లేవు. రైతులు సంతోషంగా ఉన్నారు అని కేసీఆర్ తెలిపారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వాలని కెసిఆర్ కోరారు..