సంవత్సరంలోపు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల భర్తీ..సీఎం రేవంత్‌ రెడ్డి..

*సంవత్సరంలోపు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.* నిరుద్యోగుల ఆకాంక్షలను నిజం చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. *త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీచేస్తామని* హామీ ఇచ్చారు. *హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్‌ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.*
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీఎస్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. *కోర్టు అడ్డంకులను తొలగించి 7వేల 94 మందికి సర్కారీ నౌకర్లు కల్పించామని* సీఎం రేవంత్‌ వివరించారు. *విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో పదేళ్లుగా గత ప్రభుత్వం యువత ఆకాంక్షలు నెరవేర్చలేదని* సీఎం మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని* ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సీఎం పరివారం గురించి మాత్రమే ఆలోచిస్తోందని ఆక్షేపించారు. ఆరోగ్య