ఫిబ్రవరి 17 న సీఎం కేసీఆర్ చే, డా. బి.ఆర్.అంబెద్కర్ నూతన తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం…!!!

ఫిబ్రవరి 17 న సీఎం కేసీఆర్ చే డా. బి.ఆర్.అంబెద్కర్ నూతన తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం..

తమిళనాడు సీఎం స్టాలిన్ , ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ , బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ , జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ , అంబెడ్కర్ మనుమడు ప్రకాష్ అంబెడ్కర్ సహా పలువురు ముఖ్యుల హాజరు._

అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో
భారీ బహిరంగ సభ

భారీ బహిరంగ సభకు
ముఖ్య అతిధుల హాజరు…

నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం.. వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో… తమిళనాడు ముఖ్యమంత్రి , డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొంటారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత.. మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సచివాలయ ప్రారంభోత్సవం లో పాల్గొన్న పైన పేర్కొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.