మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల..!

BREAKING

4 స్థానాలకు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన AICC

మెదక్ – నీలం మధు

అదిలాబాద్ – డా. సుగుణ కుమారి

భువనగిరి – ఛామల కిరణ్ కుమార్ రెడ్డి

నిజామాబాద్ – టీ జీవన్ రెడ్డి.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. మెదక్‌ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, నిజామాబాద్‌ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రం తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి పాల్గొన్నారు..

తలనొప్పిగా మారిన ఖమ్మం
తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్‌ స్థానం హాట్‌ సీట్‌గా మారింది. ఎక్కువమంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరిని బరిలో దించాలన్న అంశం కాంగ్రెస్‌ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమకు సంబంధించిన అభ్యర్థులకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం..!!