మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ..

R9TELUGUNEWS.COM..
Telangana corporations:

హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు చైర్మన్లుగా మన్నె క్రిశాంక్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, సాయిచందర్‌లను నియమించారు.
ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మన్నె క్రిశాంక్‌, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా వీద సాయిచందర్‌ నియమితులయ్యారు. ఈ పదవుల్లో వీరు రెండేండ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో తెలిపారు.