తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు..విజయసాయి రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ నేతలు కలిపోతుందని విమర్శలు చేశారు. తాజాగా ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ ప్లాన్ చేసిందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కానీ ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కుట్రలు తెలిసి, ఆ పార్టీకి 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రెండు ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్, అతికష్టమ్మీద మూడో ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు.