తెలంగాణలో దీపావళి పండుగ సెలవు దినంలో మార్పు..తెలంగాణ సర్కార్‌ శుక్రవారం కీలక ప్రకటన.!!!

తెలంగాణలో దీపావళి పండగ సెలవు విషయంలో తెలంగాణ సర్కార్‌ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.

గతంలో దీపావళి సెలవుగా ప్రకటించిన తేదీని మార్చింది. ఈ మేరకు సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12వ తేదీని దీపావళి సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజా గా దీపావళి సెలవును నవంబర్ 13కు మారుస్తూ శుక్రవారం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.

ఈ మేరకు మార్చిన సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది..

ప్రభుత్వ ఉత్తర్వులను ప్రభుత్వ, ప్రవైటు సంస్థలన్ని అమలు చేయాలని ఆదేశించింది. నిజానికి ఈ దఫా దీపావళీ పండుగ ఆదివారం రావడం, సోమవారం సెలవు దినం కావడం, అంతకుముందు రెండో శనివారం కావడంతో చాలమందికి వరుసగా మూడు సెలవులు కలిసివస్తున్నాయి..