తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం!!…
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది…
8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి…
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది…
ఈ ఎన్నికల ప్రక్రియ నవంబర్ రెండోవారంలో మొదలై డిసెంబర్ మొదటి వారంలో ముగుస్తుందని ఈసీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది…
రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ఒకే దశలో నిర్వహించాలని ఈసీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం…
ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో నిర్వహించనున్నట్టు తెలిసింది. 2018లో కూడా ఇలాగే పోలింగ్ నిర్వహించారు…