నవంబర్ 30 న తెలంగాణ లో ఎన్నికలు… డిసెంబర్ 3న కౌంటింగ్.

BREAKING…

న్యూఢిల్లీ..ఐదు రాష్టాల ఎన్నికల షెడ్యూల్ విడుదల…

*తెలంగాణ ఎన్నికలు ఇలా..

నవంబర్ 3న నోటిఫికేషన్
పోలింగ్ తేదీ -నవంబర్ 30

ఫలితాల ప్రకటన డిసెంబర్ 3

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 35,356

27,798 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

ఎన్నికల కోసం 72 వేల బ్యాలెట్‌ యూనిట్లు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు
తెలంగాణలో ఒకే విడత ఎన్నికలు..

ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ ఘడ్ లో అసెంబ్లీల పదవీకాలం ముగుస్తన్ననేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని ప్రకటిస్తున్నారు…

మిజోరంలో నవంబర్ 7వ తేదీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఛత్తీస్ ఘడ్ లో రెండుదశల్లో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు ఉంటాయని ఈసీ ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో నవంబర్ 7న ఒకే దశలో ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఛత్తీస్ ఘడ్లో నవంబర్ 23న ఎన్నికలు ఉంటాయన్నారు. తెలంగాణలో నవంబర్ 30 న ఎన్నికలు ఉంటాయన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న నిర్వహిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పూర్తి ప్రక్రియ డిసెంబర్ 5కల్లా ముగుస్తుందన్నారు.