ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై భేటీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రోటోకాల్‌ వివాదంపై ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఇటీవల గవర్నర్‌ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అనేక కార్యక్రమాల్లో గవర్నర్‌ను పట్టించుకోలేదని తమిళిసై వివరించినట్లు తెలుస్తోంది..