బడ్జెట్ సమావేశాలు 2024 గవర్నర్ ప్రసంగం…

*🔹బడ్జెట్ సమావేశాలు 2024 గవర్నర్ ప్రసంగానికి counter points*

అధికారమున్నదని హద్దుపద్దులేక అక్రమార్గంలో సంపాదించే రోజులు పోయినాయి”
అంటూ కాళోజీ పద్యంఉటంకిస్తూ సాగిన గవర్నర్ ప్రసంగం..
అరవై ఏండ్లు దేశాన్ని దోసుకున్న కాంగ్రేస్ పార్టీకి సరిగ్గా వర్తిస్తాయి.

నాడు తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ ప్రభుత్వాన్ని సోనియా గాంధీని ప్రస్తావించిన గవర్నర్.. త్యాగాలుచేసిన తెలంగాణను సాధించిన కేసీఆర్ కృషిని ఎందుకు గుర్తించలేదు.?

మొత్తం 13 గ్గారెంటీలు ఉంటే వాటిని ఆరుగ్యరంటీలు అని కుదించి చెప్పడం…వాటిల్లో రెండు మరో రెండు అమలు చేస్తామని చెప్పడం ద్వారా కాంగ్రేస్ ప్రభుత్వం గవర్నర్ చేత అబద్దాలాడించడం బాధాకరం

అప్పులపాలైనా రాష్ట్రాన్ని అప్పగించారు అని గవర్నర్ ద్వారా చెప్పించడం ద్వారా ప్రభుత్వం తన అవగాహన రాహిత్యాన్ని మరోసారి బయటేసుకుంది..

గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని పనులను తమవిగా చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది…

రాబోయే ఆర్థిక సంవత్సరానికి దిక్సూచిగా నిలిచే గవర్నర్ బడ్జెట్ ప్రసంగం లో ఏమాత్రం పసలేదు..పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రసంగ కాపీ నుంచి కాపీ కొట్టినట్టుగా వుంది

ఇంటర్నెట్ ను ప్రాథమిక హక్కుగా గుర్తించి అందుకు సంబంధించి బృహత్తర కార్యాచరణను అమలుచేసి పల్లె పల్లెకు ఇంటర్నెట్ ను అందుబాటులోకి తెచ్చింది మా బిఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని కూడా వారి ఖాతాలో వేసుకునేందుకు గవర్నర్ ప్రసంగాన్ని వినియోగించుకివడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం..

బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తమది చెప్పుకోవడం కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనవాయితిగా మారింది.. చివరికి గవర్నర్ ప్రసంగాన్ని కూడా అందుకు వేదికగా మార్చుకోవడం ప్రజలు గమనిస్తున్నారు…

లక్షలాది కోట్ల సంపదను సృష్టించి తెలంగాణ ను తొమ్మిదేండ్ల అనతికాలం లో దేశానికే ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కక్షపూరితంగా పదే పదే నిందల పాలు చేస్తున్న కాంగ్రేస్ నిలదీయాల్సిన బీజేపీ ప్రభుత్వాన్ని వెనకేసుకురావడం అనేక అనుమానాలకు తావిస్తున్నది..
*హైదరాబాద్..రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు..*

ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు..

గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం..

రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం..

దశాబ్ధకాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం..

TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తాం..

ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నాం-గవర్నర్‌ తమిళిసై..

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు చిల్లి గవ్వ కూడా కేటాయింపులు జరగని అంశాన్ని తెలంగాణకు కేంద్రం చేసిన సహాయ నిరాకరణను నామ మాత్రంగానైనా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించక పోవడం శోచనీయం.

రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి.. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వం ఇటువంటి మెతక వైఖరి అవలంబించడం దేనికి సంకేతం..?..