రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల విజ్ఞప్తుల మేరకు *సొంత గృహా నిర్మాణాలకు,సొంత అవసరాలకు కావలసిన ఇసుకను ఇక నుండి ఉచితంగా* అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది

ఈ మేరకు ప్రభుత్వం గుర్తించిన *ఇసుక రీచ్* ల నుండి మాత్రమే ఉచిత ఇసుక అందించాలని
*రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజి ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా* శనివారం ఉత్తర్వులు జారీ చేశారు

ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి సరియైన పత్రాలు చూపించాలని,లేనిచో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు..

ఇసుక కొరతతో లోకల్‌గా నిర్మాణ పనులు ఆగిపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన రీచ్‌ల నుండి ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించింది. సరియైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకకు ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.