గురుకులాల ఉద్యోగ ఫలితాల వెల్లడి…!.త్వరలో పోలీస్‌ ఉద్యోగాల భర్తీ పూర్తి…!!

తొలగిన అడ్డంకులు.. గురుకులాల ఉద్యోగ ఫలితాల వెల్లడి..

త్వరలో పోలీస్‌ ఉద్యోగాల భర్తీ పూర్తి.

వివిధ ఉద్యోగ నియామకాలకు ఎదురవుతున్న ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో వాటి భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది*

తాజాగా గురుకులాల్లో 9,210 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం.. సుమారు 15 వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వారం రోజుల్లో నియామక పత్రాలను అందించాలని నిర్ణయించింది. అలాగే.. గ్రూప్‌-4 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని, గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేయాలని, ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. పోస్టుల భర్తీలో మహిళా రిజర్వేషన్‌ అమలు విషయంలో సంక్లిష్టత ఉండేది. ఈ రిజర్వేషన్‌ వర్టికల్‌గానా, లేక సమాంతరంగానా అనే అంశంపై సందిగ్ధం ఉంది. తాజాగా రాజ స్థాన్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రిజర్వేషన్లను సమాంతరంగా అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి సర్క్యులర్‌ జారీచేశారు. ఈ విధానంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి టీఎ్‌సపీఎ్‌ససీ, ఇతర నియామక బోర్డులు సన్నద్ధమవుతున్నాయి. ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం*

*గ్రూపు-4 పొస్టులకు తొలగిన అడ్డంకి !*

మహిళా రిజర్వేషన్‌ అమలుపై స్పష్టత రావడంతో.. గ్రూపు-4 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెల్లడించాలని టీఎ్‌సపీఎ్‌ససీ అధికారులు భావిస్తున్నారు. సుమారు 8,039 గ్రూపు-4 పోస్టుల కోసం ఇప్పటికే పరీక్షలను పూర్తి చేశారు. తుది కీని కూడా ప్రకటించారు. అయితే.. ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి స్పష్టత లేకపోవడంతో వీటిని వెల్లడించలేదు. తాజాగా మహిళా రిజర్వేషన్‌ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో. వీటి ఫలితాలను ప్రకటించడానికి అధికారులు చర్యల్ని తీసుకుంటున్నారు*

*🔶గ్రూపు-1 అభ్యర్థులకు మరోసారి పరీక్ష !*

*🌀ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్‌ రాసిన గ్రూప్‌-1 అభ్యర్థులు మరోసారి ఆ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ప్రకటించిన 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులను జతచేసి, కొత్తగా నోటిఫికేషన్‌ను జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తవారు మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నది. అలాగే.. అభ్యర్థుల వయో పరిమితిని కూడా రెండేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించారు. గత నోటిఫికేషన్‌ సమయంలోనే ప్రభుత్వం పదేళ్ల పాటు వయోపరిమితిని పొడిగించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం ద్వారా అది 12 ఏళ్లకు పెరగనుంది*

*🔹గ్రూపు-2, 3 పోస్టుల పరీక్షలు..*

*❇️గ్రూపు-2, 3 పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 783 గ్రూపు-2 పోస్టుల కోసం సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి ఈ పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. పేపర్‌ లీకేజీ నేపథ్యంలో నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేశారు. ఆ తర్వాత అభ్యర్థుల ఆందోళనతో మళ్లీ జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేశారు. కొత్త టీఎ్‌సపీఎ్‌ససీ ఏర్పాటు ప్రక్రియ నేపథ్యంలో జనవరిలోనూ ఈ పరీక్షలు జరగలేదు. ఇక.. సుమారు 1,363 గ్రూపు-3 పోస్టుల కోసం 5.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. వీటితోపాటు.. ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీఎ్‌సపీఎ్‌ససీ భావిస్తోంది. ఇందులో ముఖ్యంగా లైబ్రేరియన్లు(71), డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు (18), ఇంటర్మీడియెట్‌ జూనియర్‌ లెక్చరర్లు(1392), అసిస్టెంట్‌ ఇంజనీర్లు(833), వెటర్నరీ సర్జన్లు(185), టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ (175), ఉద్యాన అధికారులు, అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ తదితర పోస్టులున్నాయి*

*💠త్వరలోనే డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌*

*✡️ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మెగా డీఎస్సీని ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి మరికొన్ని పోస్టులను జోడించి మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1,739, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు 2,575, భాషాపండిట్‌ పోస్టులు 611, పీఈటీ పోస్టులు 164 ఉన్నాయి. వాటికి మరో 6వేల పోస్టులను జత చేసి, మెగా డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది*

*ఒకే మార్కులు వస్తే స్థానికతకు ప్రాధాన్యం*

*పోటీ పరీక్షల్లో అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే.. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీఎ్‌సపీఎస్సీ ప్రకటించింది. తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థికి మెరుగైన ర్యాంకును ఇస్తామని.. ఇద్దరి స్థానికతా ఒకటే అయితే అభ్యర్థి వయసుకు ప్రాధాన్యమిస్తామన్నారు. స్థానికత, పుట్టిన తేదీ ఒకటే అయితే.. ఆయా సబ్జెక్టుల్లోని మార్కుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అప్పటికీ తేలకపోతే.. ఉన్నత విద్యను, ఉన్నత విద్యలో సాధించిన మార్కులశాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలోనూ సమానంగా ఉంటే కమిషన్‌దే తుది నిర్ణయం అవుతుంది*