మర్రి శశిధర్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామారావు పటేల్ సహా పలువురు ముఖ్యనేతలు బీజేపీలో చేరిక..

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరారు. మర్రి శశిధర్‌రెడ్డితో పాటు ఆదిలాబాద్ జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామారావు పటేల్ సహా పలువురు ముఖ్యనేతలు కూడా బీజేపీలో చేరారు.
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సోనోవాల్‌, కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ సమక్షంలో వీరు కమలదళంలో చేరారు.