పంట నష్టపోయిన ఎకరాకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల రూపాయలు ఇస్తుంది..రాష్ట్ర మంత్రి హరీశ్ రావు…

రాత్రి కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో పంట పొలాలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి పరిశీలించి పంట నష్టపరిహారం పై రైతులకు రాష్ట్ర ఆర్థిక,వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భరోసా ఇచ్చారు. ఈ మేరకు దుబ్బాక నియోజకవర్గంలో ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.

ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వానతో నోటి కాడికి వచ్చిన ముద్ద నేల పాలైనట్లు చేతి కాడికి అందిన పంటలను రైతులు కోల్పోవడం దురదృష్టకరం.

ఆరుగాలం కష్టపడి రాత్రనక పగలనక రైతులు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయింది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా వడగండ్ల వానతో జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం జరిగింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు బిడ్డ, రైతు కష్టాలు తెలిసిన నేతగా పంట నష్టాన్ని పరిశీలించి రైతులను ఆదుకునేందుకు నన్ను ప్రతినిధిగా పంపారు.

– జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని 25 గ్రామాల్లో తిరిగి పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడాను.

– రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉందని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకి రూ.10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని, రైతులు ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా కల్పించాం.

– పంట నష్టపోయిన ఎకరాకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల రూపాయలు ఇస్తుంది.

– రైతులను ఆదుకోవాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంటే వారు మరో రూ.10 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి.

– జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా పథకాలను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారు.

– యాసంగి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పండే బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం తీసుకోకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నది.

– రూ.30 వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆపిన రైతుల మోటార్లకు కరెంటు మీటర్లు పెట్టలేదు.

– రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వలన రాష్ట్రంలో యాసంగిలో 57 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఇవన్నీ రైతుల పట్ల సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనం.నగదు బదిలీ పథకానికి ప్రత్యక్ష నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు…అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో నగదు బదిలీ పథకాలు. అన్నదాతల ఆదాయం పెంచే ప్రయత్నం కేసీఆర్ చేస్తుండు. దేశంలో అతి ఎక్కువ ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డు తెలంగాణ రాష్ట్రానికి రావడం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు నిదర్శనం..సీఎం కేసీఆర్ రైతుబంధు, మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా వ్యవసాయంగానికి గట్టి పునాదులు వేశారు…ఏ గ్రామంలో తిరిగిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం పట్ల రైతులలో ప్రేమ అభిమానం కనబడుతున్నది.