తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం ..

డిసెంబరు 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో తదుపరి కార్యాచరణపై చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌ కావడంతో తదుపరి కార్యాచరణపై చర్చించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. న్యాయ నిపుణుల అభిప్రాయాలతో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ మినహా మిగిలిన మంత్రులందరూ హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు వెల్లడిచారు..

తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ వర్సిటీ కి అనుబంధంగా మరో 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటు చేసేందుకు మంత్రవర్గం ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి విజయవంతగా రెండేళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. కేబినెట్ భేటీలో తీసుకున్న మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు కాసేపట్లో తెలియనుంది. మంత్రి వర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ మినహా అందరూ మంత్రులు, సీఎస్ రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారులు కూడా ఉన్నారు..

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే.

_• TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేదని, అంతకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేసే అర్హత ఉండేది కాదన్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చాలని క్యాబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీంతో వార్డు మెంబర్, సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఊరట లభించనుంది..