తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల….

తెలంగాణ లోని రెండు ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను ప్రకటించింది._

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి శాసన సభ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపింది.

అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది. 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనున్నది. 19న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుంది._ *🔹29న ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. ఫిబ్రవరి 1న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.*

తెలంగాణ లోని రెండు స్థానాలతో పాటు యూపీ లోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.