ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ జోరు…

*నల్గొండ*…
R9TELUGUNEWS.COM.
తొలి ప్రాధాన్యత ఓట్లలో…. గెలుపు కోటా సాధించిన టీఆరెస్ అభ్యర్థి కోటిరెడ్డి.

టిఆరేఎస్ కు 917, స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు..

మొత్తం..1233 ఓట్లు….

*మెదక్*

800 ఓట్లు కౌంటింగ్ పూర్తి

Trs అభ్యర్థి కి 585 ఓట్లు పోల్ అయిన ఓట్లలో సగానికి కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన trs అభ్యర్థి యాదవ రెడ్డి

కాంగ్రెస్ కి 202 ఓట్లు

ఇండిపెండెంట్ కు 2 ఓట్లు

చెల్లని ఓట్లు 11

*ఖమ్మం* .. MLC ఎన్నికల్లో 238 ఓట్స్ మెజారిటీ తో గెలిచిన TRS అభ్యర్థి తాత మధు

మొత్తం పోల్ అయిన ఓట్స్..738
Trs.. 480
Cong..242..
కొండపల్లి శ్రీనివాస్..
indipendent.. 4 ఓట్స్..
12 చెల్లని ఓట్స్…

*కరీంనగర్ జిల్లా*

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి ఆర్ యస్ అభ్యర్థులు టి.భాను ప్రసాద్,ఎల్ రమణ గెలుపు

1200 ఓట్లు లెక్కింపు పూర్తి

బాను ప్రసాద్ కు
500 ఓట్లు

ఎల్ రమణ 450 ఓట్లు

ఇండిపెండెంట్ అభ్యర్థి రవిందర్ సింగ్ కు 175

చెల్లని ఓట్లు 30

*ఆదిలాబాద్*

ఎమ్మెల్సీగా దండే విఠ‌ల్ ఘ‌న విజ‌యం

740 ఓట్ల‌తో విజ‌యం సాధించిన దండే విఠ‌ల్

74 ఓట్ల‌కే ప‌రిమిత‌మైన స్వ‌తంత్ర అభ్య‌ర్థి..

ఇప్పటికే ఆరు స్థానాలను ఏకగ్రీవం ద్వారా తన ఖాతాలో వేసుకున్న టీఆర్ఎస్‌ పార్టీ.. పోలింగ్‌ జరిగిన స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటింది. కరీంనగర్‌ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎల్. ర‌మ‌ణ‌, భానుప్రసాద్ రావు, ఖ‌మ్మం జిల్లాలో తాత మధుసూదన్, ఆదిలాబాద్ జిల్లాలో దండె విఠ‌ల్, మెద‌క్ జిల్లాలో యాద‌వ‌రెడ్డి, నల్గొండ జిల్లాలో ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు.. మొత్తంగా ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ క్లీన్‌స్వీప్ చేసింది. లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ.. మరో ఆరు చోట్ల కూడా తమ అభ్యర్థులకు తిరుగులేని విజయాన్ని అందించింది…
ఉమ్మడి కరీంనగర్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో
టీఆర్‌ఎస్‌ జయభేరి…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జయభేరి మోగించింది. ఇక్కడ ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ఉన్న భానుప్రసాద్‌, ఎల్‌.రమణ ఇద్దరూ గెలుపొందారు. ఇక్కడ మొత్తం 1320 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 17 ఓట్లు చెల్లనివి కాగా, 1303 చెల్లుబాటు అయ్యాయి.

భానుప్రసాద్‌కు 584 ఓట్లు రాగా, రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధించినట్లయింది.