తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాధాకృష్ణన్‌కు కేంద్రం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. దాంతో ఇవాళ ఆయన ప్రమాణస్వీకారం చేశారు.తెలంగాణతోపాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా రాధాకృష్ణన్‌ అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న తమిళిసై రాజీనామా చేయడంతో ఆ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే ఉద్దేశంతో తమిళిసై గవర్నర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవులను వదులుకున్నారు. దాంతో జార్ఖండ్‌ గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు కేంద్రం అదనపు బాధ్యతలు కట్టబెట్టింది..

రాజ్‌భవన్‌లో జరిగిన తెలంగాణ నూతన గవర్నర్ శ్రీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవానికి,, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల, Sridhar Babu(శ్రీధర్ బాబు). కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్,, హాజరయ్యారు.