తెలంగాణ నూతన సచివాలయం కార్యక్రమాలు ప్రారంభం..

తెలంగాణ నూతన సచివాలయం..

_తెలంగాణ నూతన సచివాలయం కార్యక్రమాలు ప్రారంభం._
_ముందుగా ద్వార లక్ష్మీ పూజను నిర్వహించిన ఋత్విక్కులు._
_-అనంతరం గణపతి హోమం, సుదర్శన యాగం._
నాలుగు గంటల పాటు ప్రత్యేక పూజలు.
1 గంటకు పూర్ణాహుతి కార్యక్రమం.
1:20నిమిషాలకు..6వ అంతస్థులో తన ఛాంబర్ లో కొలువుతీరనున్న సిఎం కేసీఆర్.

ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించే కార్యక్రమాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్వహిస్తారు…వెంటవచ్చిన మంత్రులు కార్యదర్శులు సీఎంవో సిబ్బంది తదితర సచివాలయ సిబ్బంది వారి వారి చాంబర్లల్లోకి వెళ్లి సీట్లల్లో కూర్చుంటారు..అందరూ కలిపి దాదాపు 2500 మంది హాజరవుతారని అంచనా. ఆహ్వానితులకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారు.సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా ఉంటుంది. ఆ దర్వాజని భోపాల్ నుంచి ప్రత్యేకంగా వుడ్ కార్వింగ్ చేసి తెప్పించారు…