బండి సంజయ్ గోబ్యాక్ యాదాద్రిలో తెరాస నిరసన..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ యాదాద్రి పర్యటనకు వ్యతిరేకంగా స్థానిక తెరాస శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి.తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తమ నిజాయతీని నిరూపించుంటామని.. యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానంటూ గురువారం సవాల్‌ విసిరిన సంజయ్‌.. శుక్రవారం అక్కడికి బయల్దేరిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టలో తెరాస నేతలు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. సంజయ్ యాదాద్రి పర్యటనను అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. మరోవైపు భాజపా శ్రేణులు సంజయ్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో యాదగిరిగుట్టలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాలతో పాటు యాదాద్రి వెళ్లే మార్గాల్లో మోహరించారు