తెలంగాణాలో ఆరెంజ్ అలర్ట్ జారీ..!

తెలంగాణాలో ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో ఆరుబయట పనిచేసేవారితో పాటు పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి…తెలంగాణలో గత కొద్ది రోజులుగా పొడి వాతావరణం ఉండగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత మరింత పెరిగింది. భానుడి భగభగలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయ్యాయి. మంగళవారం తలమడుగు, జైనథ్‌ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదనైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదయింది..