తెలుగు రాష్ట్రాల మధ్య ఇది రెండో వందే భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ..

సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇది రెండో వందే భారత్ రైలు కాగా.. దేశంలో 13వ ట్రైన్. అంతకుముందు బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న మోదీ.. రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నారు. కాసేపు వందే భారత్ ట్రైన్‌లో తిరుగుతూ.. ట్రైన్‌ ఉన్న చిన్నారులతో కాసేపు మాట్లాడారు. అనంతరం ప్లాట్‌ఫామ్‌పై నుంచి జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.