వికారాబాద్ జిల్లాలో వ‌డ‌గండ్ల వాన‌.. హైదరాబాద్ లో వర్షం..!.

*వికారాబాద్ జిల్లాలో వ‌డ‌గండ్ల వాన‌.. హైదరాబాద్ లో వర్షం..!.

వికారాబాద్ జిల్లాలో వ‌డ‌గండ్ల వాన‌ కురిసింది.

అంతేకాకుండా పలుచోట్ల వర్షాలు కురవగా… హైదరాబాద్ లో కూడా వాతావరణం పూర్తిగా చల్లబడింది.

రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి.

ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చింది. అయితే గురువారం వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. పరిగి, పూడురు మండలాల పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

ఇక హైదరాబాద్ పరిధిలో కూడా వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది.