రైవంత్ సర్కార్.. రైతు బంధు నగదు విడుదలపై కీలక అప్డేట్..!

Telangana coungres paarti.తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు కీలక వివరాలను సేకరించడంతోపాటు.. ఒకేసారి నిధుల విడుదల కోసం కసరత్తులను ప్రారంభించింది..ఈ క్రమంలో రైవంత్ సర్కార్.. రైతు బంధు నగదు విడుదలపై కీలక అప్డేట్ వచ్చంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరరావు.. రైతు బంధు నిధుల విడుదలపై మాట్లాడారు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఆంధ్రానగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి తుమ్మల.. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నేటికీ తన ఆదర్శ నాయకుడంటూ మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. రైతుబంధుతోపాటు.. రుణమాఫీపై కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు..