రేషన్ కార్డు దరఖాస్తుదారులు ఇది తెలుసుకోండి..!

*🔹రేషన్ కార్డు దరఖాస్తుదారులు ఇది తెలుసుకోండి..*
తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు మీసేవ కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు. దీంతో మీసేవ కేంద్రాల వద్ద భారీ రద్దీ వాతావరణం కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుండే మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ మీసేవ విభాగం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటోంది..

రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో
*ఎన్రోల్మెంట్ నెంబర్* తో సహా ఉన్న ఆధార్ కార్డు మాత్రమే తీసుకువెళ్లాలి..

👉🏻గతంలో రేషన్ కార్డులో పేరు ఉండి కొత్తగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు పెట్టుకునేవారు ముందు ఉన్న రేషన్ కార్డులో పేరు ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి తొలగించుకోవాలి *ఉదాహరణకు:(కొత్తగా పెళ్లి అయిన అమ్మయి పేరు వారి తల్లిదండ్రుల రేషన్ కార్డులో వుంటే… అదే మండల ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి డిలీట్ చేయించాలి)..

👉🏻 అడ్రస్ మార్పిడి కొరకు ఆధార్ కార్డు, రెసిడెన్సి సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి

👉🏻 పేరు చేర్చుట కోసం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ తో పాటు చేర్చే వారి ఆధార్ కార్డు తీసుకెళ్లాలి (ఒక కుటుంబంలోని రేషన్ కార్డులో కొత్తగా ఒక బాబు పేరు చేర్చడం కోసం ఆ కుటుంబ పెద్ద *(కుటుంబ పెద్ద ఆ ఇంటి మహిళ వుంటుంది కాబట్టి మహిళ ఆధార్ కార్డు మాత్రమే)* ఆధార్ కార్డు అలాగే ఆ బాబు ఆధార్ కార్డు, తీసుకువెళ్లాలి