తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్… హెచ్ఆర్ఏలో కోత…!

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది.

దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యో గులకు అధిక నష్టం కల గనుంది. ఇక్కడ ఇప్పటి వరకు 30 శాతం ఉన్న HRAను 24 శాతానికి పరిమితం చేసింది.

అలాగే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజా మాబాద్, గోదావరిఖని, వరంగల్,జిల్లాలలో పనిచేసే వారికి 17 శాతం, మిగతా జిల్లాల్లోని వారికి 13 నుంచి 11 శాతానికి తగ్గించింది…

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ తమ ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం 2017 లో 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించగా, తాజాగా 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. తాజాగా ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్లో హెచ్ఆర్ఏలు తగ్గించినట్లు తెలుస్తుంది. కాగా ఆర్టీసీలోని 42 వేల పైచిలుకు కార్మికుల్లో 20 వేలకు పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఉద్యోగులు అత్యధికంగా నష్టపోయే అవకాశం నెలకొంది..