దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం.. సెలవుల కుదింపుపై పుకార్ల నేపథ్యంలో విద్యాశాఖ వివరణ…

దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు దసరా సెలవులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సెలవుల కుదింపుపై పుకార్ల నేపథ్యంలో విద్యాశాఖ వివరణ ఇచ్చింది.