ఈనెల 22న తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు. ఉన్నాయ లేవా.?

దేశవ్యాప్తంగా పండగల నిర్వహిస్తున్న అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 22న అంగరంగ వైభవంగా జరగనున్నది.. ఈ కార్యక్రమనికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంతవరకు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడంపై ఇంకా ఉత్కంఠత నెలకొంది.. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము అయోధ్య రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలపడంతో దేశవ్యాప్తంగా కూడా కొంత విమర్శలకు తావిచ్చింది.. అదే కాంగ్రెస్ పార్టీలో కొంత అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.. ఆ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాబట్టి స్కూలుకు సెలవులు ఇస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు..!

అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ జరిగే 22న సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది…
ప్రతి గ్రామంలో ఆ రోజున పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి సెలవు ఇవ్వాలని సంఘం అధ్యక్షుడు కే హనుమంతరావు, ప్రధాన కార్యదర్ళి నవత్‌ సురేశ్‌ కోరారు. గత ఏప్రిల్‌లో పదోతరగతి పరీక్షల మూల్యాంకన పారితోషికాన్ని ఉపాధ్యాయులకు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కృష్ణారావును కోరినట్టు తెలిపారు..

భారత దేశమంతా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుండగా.. ఆ రోజున ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి రోజు.. హర్యానా, చత్తీస్ గఢ్, త్రిపుర, ఒడిశా, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో హాఫ్ డేను అధికారిక హాలిడేగా ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే.. తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరి 22న సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బండి సంజయ్ కోరారు…అయోధ్యలో శ్రీరామవిగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా అందరూ పాల్గొనాలని సూచించారు. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి నిధుల సమీకరణలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు…అయోధ్య రాముడు ఒక్క బీజేపీకే దేవుడు కాదని.. దేశంలోని అందరికీ దేవుడేనని బండి సంజయ్ పేర్కొన్నారు. రాముడిని బీజేపీకి మాత్రమే అపాదిస్తూ.. వివాదాస్పదం చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్షింతలు కావాలంటే బాస్మతి బియ్యాన్ని అయోధ్యలోని శ్రీరాముని పాదాల దగ్గర పెట్టి తీసుకొస్తామన్నారు. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 22న అధికారింంగా సమావేశాలు పెట్టే ప్రయత్నం చేస్తుందని.. ఇది సరైన పద్ధతి కాదని బండి సంజయ్ దుయ్యబట్టారు..

22వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని డిమాండ్ వినబడుతోంది. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలో గొప్పగా జరగబోతోన్న ఈ వేడుకలకి యూపీ, గోవా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు.. జనవరి 22వ తేదీన అందరూ పండుగ జరుపుకోవాలని సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి..