ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కాసేప‌టి క్రితం బేగంపేట్ విమానా శ్రయం నుండి ప్రత్యేక విమానంలో సీఎం హస్తినకు పయనమయ్యారు.

సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సైతం ఢిల్లీకి వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌కు వెళ్లడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపు, ప్రచార వ్యూ హలు, చేరికల విషయంపై అధిష్టానంతో చర్చించను న్నట్లు టాక్.

వీటితో పాటుగా అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి కావడంతో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ గురించి కూడా పార్టీ పెద్ద లతో సీఎం చర్చించను న్నట్లు సమాచారం..