తెలంగాణ రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్విభజన..

తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

_పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించబోతున్నట్లు సమాచారం..

_ప్రస్తుతం 33 జిల్లాలుండగా వాటిని 17కు కుదించే అవకాశం ఉందని సమాచారం.

_ఏపీ తరహాలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది._

దీనికోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి సాధ్యా సాధ్యాలను పరిశీలించనున్నారు…

33 జిల్లాలు ఉండాలా లేదా అనే చర్చ కంటే, ఒక జిల్లాలో 3 నుంచి 4 లక్షల జనాభా ఉంటే మరో జిల్లాలో కోటిపైన ఉంది.

హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కోటి పైచిలుకు జనాభా ఇక్కడ ఉంది.

ఇంత ఇర్రేషనల్‌గా.. నచ్చితే నజరానా.. నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా ఉంది..

బడ్జెట్ సెషన్‌లో అసెంబ్లీలో చర్చించి డీలిమిటేషన్ కోసం ఒక రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జి, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టి మండలాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్లు, జిల్లా వి‌‍‌భజనపై కమిషన్ వేస్తాం.

119 నియోజకవర్గాలు తిరిగి అక్కడ ఏమేం కావాలో కమిషన్ అధ్యయనం చేస్తుంది’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.

రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది..

తెలంగాణలో 18 జిల్లాలు ఔట్?

తెరపైకి మరోసారి జిల్లాల పునర్విభజన అంశం.

ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం?

ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో రాష్ట్రంలో ప్రకంపనలు.

ఇది రేవంత్ మరో పిచ్చి తుగ్లక్ పని అంటున్న ప్రజలు.

ఈ నిర్ణయం అమలైతే రద్దు కాబోయే జిల్లాలు:

ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం

ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇవ్వాళ ప్రచురించిన కథనం ప్రకారం ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్ సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవలే 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

ఇప్పటికే కొత్త జిల్లాలు కుదురుకుంటున్న సమయంలో వచ్చిన ఈ వార్తతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయం.

కొత్త జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు:

రద్దు చేయబోయే జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం. రియల్ ఎస్టేట్ కూడా ఢమాల్.

జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్ళీ భారీ బదిలీలు. ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తం.

విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి, ఉన్న మ్యాప్ లన్ని తిరగరాయాలి

పోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు.

ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగం.

పార్లమెంటు ఎన్నికల ముంగిట రేవంత్ సర్కార్ ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.