తెలంగాణ విద్యార్థుల‌కు బూట్లు, బ్యాగ్స్ పంపిణీ!..

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పేందుకు సిద్ధ‌మైంది.

విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, బ్యాగ్ పంపిణీ చేయాలని స‌ర్కార్ భావిస్తోంది. ఈ విష‌యాన్ని వ‌చ్చే నెలలో కేంద్రం ముందుకు తీసుకెళ్ల‌నుంది.

కేంద్రం ఈ ప‌థ‌కానికి ఆమోదం తెలిపితే రూ.290 కోట్ల ఖర్చులో 40% శాతం వాటాను మాత్ర‌మే రాష్ట్రం భ‌రిస్తే స‌రిపోతుంది. మిగిలిన 60% వాటాను కేంద్రం ఇస్తుంది.