తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల బదిలీ…

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ ఎస్పీగా చందనాదీప్తిని ప్రభుత్వం నియమించింది. సీఐడీ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఎస్పీగా అపూర్వరావును బదిలీ చేసింది.ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా కొనసాగుతున్న అపూర్వరావును బదిలీ చేసిన ప్రభుత్వం… ఆమె స్థానంలో వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న చందనా దీప్తిని నల్గొండ ఎస్పీగా నియమించింది. అపూర్వరావుకు ఐసీడీ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ( ఆదివారం) ఉత్తర్వులు జారీచేశారు. చందనా దీప్తి ఇంతకు ముందు నార్త్‌ జోన్‌ డీసీపీగా పని చేశారు. ఇటీవల పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. చందనాదీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేసింది. తాజాగా నల్గొండ ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది…