🌹ఎందుకో
తెలియదు🌹
రాధిక..కవిత 16-58.
ఎందుకో
తెలియదు..
కొంతమంది
మనుషులు..
కొంతమంది
పరిచయాలు..
మరికొంతమంది
స్నేహాలు..
ఇంకొంతమంది
మాటలు..
చాలామంది
ఆలోచనలు..
ఎదుటి వారిపై
వాళ్ల భావనలు..
ఎందుకో తెలియని
అహంకారం..
ఈర్ష్యాసూయలు
రాగద్వేషాలు..
ఎదుటి మనిషి
గురించి నిందలు..
ప్రేమతో ఉండవలసిన
హృదయాలు..
కోపాలతో, శాపాలతో
దహించిపోకు నేస్తమా..
ప్రేమతో ప్రపంచాన్ని
జయించు మిత్రమా….
*******************
🌹వేచియున్న
హృదయమా..🌹
రాధిక… కవిత…16-59…
వేచియున్న
హృదయమా..
ఎదురుచూపులు
ఎన్నాళ్ళూ..
నీతో దూరానికే
మది తట్టుకోలేదు..
ఒంటరిగా ఉంటే
కృంగి పోతుంది..
విరహ తాపాలు
నీకోసం..
నీ మాట వినగానే
లొంగిపోతుంది..
మనసు ఎంత
పిచ్చిదో..
కొద్ది ప్రేమకే నీకై
పొంగి పోతుంది..
ఆవిరవుతున్న
ఈ దేహం..
తాళలేను రా
మాధవా..
**************.
🌹అలా అలా
నడుస్తుంటే..🌹
కవిత 16-60.
అలా అలా నడుస్తుంటే
ఛలో ఛలో అంటుంది
మానసమున ఊసులు..
ఆ పిల్ల గాలి తెమ్మెరలు
నన్ను మెల్లమెల్లగా
స్పర్శిస్తూంటే హాయిగా..
నీలాల నా కనులు
అలవోకగా వీక్షించే
ప్రకృతి అందాలు..
ఓహో.. పచ్చని పైర్లు,
ఎటు విన్నా కిలకిల
పక్షుల సవ్వడులు..
కోయిల గానాలు,
మాధుర్యంగా వినిపించే,
తీయ తీయని రాగాలు..
జల జల జల పారే
నీటి సరిగమలు
సప్తస్వరాలై వినిపించే..
ఆ మామిడి కొమ్మ విరబూసే
నిండుగా పువ్వులతో ..
ఆ ముద్ద మందారం
నన్ను చూసి కొంటెగా,
కన్నుగీటే తన అందాలు
చూడమని..
గున్న మామి గుబురులో
తెల్లని కుందేలు అల్లర్లు..
నీలి మేఘం చూసిన
ఆ నెమలి పురివిప్పిన
నాట్యాలు..
ఎటు చూసినా అందమే
మనసంతా ఆనందమే..
చూసే కనులకు
మనసుంటే..
ఆ మనసుకు కూడా
కళ్ళు ఉంటే..
భావాలు ఉప్పెనగా
నన్ను ఊహాల సంద్రంలో
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే,
ఏం చేయను? ఎలా చెప్పను..?..
******************
🌹మనసారా
ప్రేమించకు🌹
కవిత 16-61..
మనసారా ప్రేమించకు
ఎవరిని కూడా..
అప్పుడే మొదలు
నీలో ఆవేదన..
రెండక్షరాలు ప్రేమ
అని పలకటం తేలిక..
కానీ హృదయానికి
పట్టింది అనుకో పిచ్చి..
నిష్కల్మషమైన స్నేహం
నిర్మలమైన ప్రేమ ఇష్టం..
ప్రేమించిన వారు దూరం
భరించలేని నరకం..
ప్రేమతో ఎన్నో జీవితాలు
అర్థంకాని సమస్యలతో..
చిక్కుప్రశ్నలతో, జీవితం
సతమతమయ్యే బ్రతుకే..
ఆనందంగా మొదలయ్యే
ప్రేమ మాటలు, భాషలు..
చిక్కు ముడులు వేసి
విప్పుకోడానికి ప్రశ్నార్ధకం..
అదేమి మాయో, ఇదేమి
మంత్రమో..?
ఆ ప్రేమ అనే పదం వినగానే
మనసు పరవశమే..
ఆ మనిషికి కైవసమై
ఉంచుకోలేని వదులుకోలేని
అంతులేని అయోమయం..
మనుషులను ప్రేమిస్తే
మనసులలో గాయాలు..
అదే నా కృష్ణుని ప్రేమిస్తే
జీవితమే బృందావనం..
ప్రేమ మనసు వాడిదే
ఎన్ని జన్మలైనా
తనువంతా హరివిల్లే..
ఆలోచనలలో ఆనందం..
అందులో ప్రతి భావం
ప్రేమతో హృదయార్పణం.
*****************