ప్రముఖ తెలుగు నటుడు పోసాని కృష్ణమురళి కరోనా….. పాజిటివ్‌ రావడం ఇది మూడోసారి. .

ప్రముఖ తెలుగు నటుడు పోసాని కృష్ణమురళి కరోనా భారినపడ్డారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. నిన్న పూణే నుంచి హైదరాబాద్‎కు వచ్చారు. అయితే వచ్చినప్పటి నుంచి కాస్త నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. కరోనా సోకినట్లు తేలింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పోసాని ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‎గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాగా పోసానికి కరోనా పాజిటివ్‌ రావడం ఇది మూడోసారి. నిన్న తెలంగాణలో 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లోనే 18 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది