అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ.. రేపు కేబినెట్లో కొత్త జిల్లాలపై చర్చ.. జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్ కాపీలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు.. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని ఉత్తర్వులు..
పోలీసుల అదుపులోనే తిప్పిరి అలియాస్ దేవ్‌జీ ఉన్నాడని మావోయిస్టుల లేఖ.. దేవ్జీతో పాటు మరో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారంటూ లేఖ.. దేవ్‌జీని వెంటనే కోర్టులో హాజరుపర్చాలంటూ మావోయిస్టుల డిమాండ్.. హిడ్మా ఎన్కౌంటర్ బూటకం.. హిడ్మాను పట్టుకుని కాల్చి చంపారు.. హిడ్మా ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 30న బంద్-లేఖలో మావోయిస్టులు..
వరల్డ్ కప్ 2025 తర్వాత టీమ్ ఇండియా విమెన్ ప్లేయర్స్ కి ఊహించని డిమాండ్.. వేలంలో ఉన్న వారిని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసేందుకు పోటీపడ్డ ఫ్రాంచైజీలు.. స్మృతి మందాన-రూ.3.5 కోట్లు (ఆర్సీబీ), దీప్తి శర్మ-రూ.3.2 కోట్లు (యూపీ వారియర్స్), రీచా ఘోష్-రూ.2.75 కోట్లు (ఆర్సీబీ), హర్మన్ ప్రీత్ కౌర్ -రూ.2.5 కోట్లు (ముంబై), శిఖా పాండే-రూ.2.4 కోట్లు (యూపీ వారియర్స్), జెమిమా రోడ్రిగ్స్-రూ.2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్), షఫాలీ వర్మ -రూ.2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్), శ్రీ చరణి-రూ.1.30 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్), అమన్‌జోత్ కౌర్-రూ.1 కోటి (ముంబై), హర్లీన్ డియోల్ -రూ.50 లక్షలు (యూపీ వారియర్స్), స్నేహ రాణా-రూ.50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్), రాధ యాదవ్ -రూ.65 లక్షలు (ఆర్సీబీ), హైదరాబాద్ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి-రూ.75 లక్షలు (ఆర్సీబీ)…
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.!..
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 10 మంది మావోయిస్టులతో కలిసి ఆయన మహారాష్ట్ర లోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ర్టాల్లో ఆయనపై రూ కోటి రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఐదుగురు మావోయిస్టులు ఉన్నారు.
జనవరి 1వ తేదీన లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని తాజాగా అనంత్ ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖ విడుదల చేసిన 24 గంటలు తిరగకముందే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ లేఖ విడుదల చేసిన తరువాత వరుసగా ఆడియో సందేశాలను విడుదల చేశారు. అందులో.. ‘మారుతున్న పరిస్థితులను పరిశీలించి పార్టీ తాతాలికంగా సాయుధ పోరాటాన్ని నిలిపివేసి, ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల్లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ప్రకారం సోనుదాదా, సతీశ్దాదా, చంద్రన్నతోపాటు మరెందరో సహచరులు ఆయుధాలను వదిలి, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పథకాన్ని అంగీకరించారు. అందుకే ఇది లొంగిపోవడం కాదు. ఇది విప్లవానికి, ప్రజలకు ద్రోహం చేయడం ఏమాత్రమూ కాదు. ప్రజల సమస్యలను మరోవిధంగా ముందుకు తీసుకెళ్దాం.
సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మనం ఎందరో సహచరులను కోల్పోయాం. ఇంకా ఎవరినీ కోల్పోవాలని కోరుకోవడం లేదు. అందుకే మీరు ఎకడున్నా సాయుధ పోరాటాన్ని తాతాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వెంటనే రావాలి. ఒకరినొకరు సంప్రదించడానికి ప్రయత్నించాలి. మనమంతా కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర అంత సమయం లేదు. చర్చలు, వాదోపవాదాలకు చాలా సమయం ఉంది. ముందుగా మనం అందరం బతికి ఉండాలి. ఈ క్లిష్ట సమయంలో సహనం కోల్పోవద్దు. ప్రతి ఒకరూ ఒంటరిగా లొంగిపోవద్దు. మనమందరం కలిసి చేస్తున్న పని ఇది’ అంటూ ముగించారు..
దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేటలో జరిగిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న హరీష్ రావు
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీగా బయలుదేరిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు
మార్గమధ్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి, ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి ఘన నివాళులర్పించి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దీక్షా దివస్ స్మారక పైలాన్‌ను ఆవిష్కరించనున్న హరీష్ రావు
అనంతరం రంగధంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకోనున్న హరీష్ రావు..
జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో కరెంట్ కట్
చీకట్లోనే ఫోన్ టార్చ్‌లైట్లతో పని చేస్తున్న సిబ్బంది
గంటకు పైగా కరెంట్ పోవడంతో కంప్యూటర్లు ఆఫ్
సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అవస్థలు
రోజూ వందలాది మంది వచ్చే జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో కరెంట్ పోవడంతో తీవ్ర విమర్శలు..
సిరిసిల్ల జిల్లాలో తల్లి కొడుకుల ఆత్మహత్య..
మానసిక స్థితి బాగాలేక నదిలో దూకిన తల్లి..ఆవేదనతో అదే నదిలో దూకి కొడుకు(పోలీస్ కానిస్టేబుల్) ఆత్మహత్య
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ, తన తల్లి మంచికట్ల లలిత(56)తో నివాసం ఉంటున్న అభిలాష్(34) అనే వ్యక్తి
గురువారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తల్లి కనిపించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన అభిలాష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గాలింపు చర్యలు మొదలుపెట్టిన పోలీసులు
శుక్రవారం ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని మానేరు నదిలో లభించిన మహిళ మృతదేహం తన తల్లిదేనని గుర్తించి, తీవ్ర మనస్తాపానికి గురయ్యి బంధువుల ముందు అదే నదిలో దూకేసిన అభిలాష్..
దాదాపు రెండు గంటల పాటు గాలింపు చర్యలు చేసిన అనంతరం, అభిలాష్ మృతదేహాన్ని వెలికి తీసిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..