తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఇవే ..!

తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఇవే ..

న్యూ ఢిల్లీ – కేంద్ర బ‌డ్జెట్ లో ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు మొక్కుబ‌డిగానే కేటాయింపులు జ‌రిగాయి.. కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్ట్ కి నిధుల గురించి బడ్జెట్ లో ఎటువంటి ప్ర‌స్తావ‌న లేదు..రైల్వే ల‌కు ఏ మేర‌కు కేటాయింపులు జ‌రిగియో కూడా వివ‌రాలు తెలీయ‌రాలేదు.. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా విష‌యంపై కేంద్రం అస‌లు ప‌ట్టించుకోలేదు.. ఒక‌ర‌కంగా కేటాయింపుల‌లో తెలంగాణ‌కు అంత ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేదు.

కేటాయింపుల వివ‌రాలు
ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ. 47 కోట్లు
పెట్రోలియం యూనివర్సిటీకి రూ. 168 కోట్లు,
రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.37 కోట్లు
సింగరేణికి రూ. 1,650 కోట్లు
ఐఐటి హైదరాబాద్‌కు EAP కింద రూ.300 కోట్లు .
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ. 683 కోట్లు కేటాయించారు.

మంగళగిరి, బిబినగర్‌ ఎయిమ్స్‌తోసహా.. దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు 6వేల 835 కోట్ల రూపాయల కేటాయించారు.
సాలార్జంగ్‌ మ్యూజియంతోపాటు దేశంలోని అన్ని మ్యూజియాల 357 కోట్లు
మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు 1473 కోట్లు,
ఇంకాయిస్‌కి 27 కోట్లు..