తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్నా ఎండలు…

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. బూర్గంపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కామవరపుకోటలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. పలుచోట్ల 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు…