జర్నలిస్టులకు ఇంటి స్థలం కేటాయించిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు కృతజ్ఞతలు – సయ్యద్ ఇస్మాయిల్.

అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు కృతజ్ఞతలు – సయ్యద్ ఇస్మాయిల్.

నూతనకల్: ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం హర్షనీయమని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ (TEMJU ) రాష్ట్ర అధ్యక్షులు,ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్ట్ నేతగా ఉంటూ ఏమ్మెల్యేగా ఎన్నికైన క్రాంతి కిరణ్ జర్నలిస్టు సమస్యలను గుర్తించి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జర్నలిస్టుల కు అందాల్సిన సంక్షేమం కోసం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారితో కలిసి క్రాంతి కిరణ్ కృషి చేస్తున్నారన్నారు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జర్నలిస్టులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు కోసం రంగం సిద్ధం చేస్తుందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు కోసం చిత్త శుద్ధితో కృషి చేస్తున్నామని ఆన్ని నియోజక వర్గాల లో ఎమ్మెల్యేలు సహకారం అందించి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరారు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మిగతా నియోజక వర్గాల కు ఆదర్శంగా నిలిచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.