రిపబ్లిక్ వేడుకలు సమీపిస్తున్న వేళ..దేశంలో భారీ ఉగ్రకుట్రలు..ప్రధాని మోదీనే టార్గెట్ …

r9telugunews.com.
రిపబ్లిక్ వేడుకలు సమీపిస్తున్న వేళ..

దేశంలో భారీ ఉగ్రకుట్రలు పన్నుతున్నాయని ఇప్పటికే ఐబీ హెచ్చరించింది. ప్రధాని మోదీ టార్గెట్ గా ఉగ్రదాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయగా.. ఆ దిశగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తోంది కేంద్రం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై.. రిపబ్లిక్ వేడుకలు నిర్వహించే వేళ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా.. పంజాబ్ లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు.పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఓ గ్రెనెడ్ లాంఛర్, 3.79 కిలోల ఆర్డీఎక్స్, 9 డిటోనేటర్లు, 2 సెట్ల టైమర్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ కు చెందిన సిక్ యూత్ ఫెడరేషన్ నుంచి ఈ పేలుడు పదార్థాలు వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. అలాగే టెర్రరిస్టులతో సంబంధాలున్న మల్కీత్ సింగ్ అనే వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రాంతంలో కూడా పేలుడు పదార్థాలు దొరకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.