జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్‌..!!గత 20 రోజుల్లో సైన్యం జమ్మూ కశ్మీర్‌లో 15 ఆపరేషన్లు.. 27 మంది ఉగ్రవాదుల హతం..!.

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామాలోని దుజన్ గ్రామంలో ఎన్‌కౌంటర్‌ జరగ్గా.. ప్రస్తుతం మిగతా ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే మరికొందరు ఉగ్రవాదులు దాక్కునట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో సైన్యం, జమ్మూ కశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించింది…బలగాలను గమనించిన ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు ధీటైన సమాధానం ఇస్తున్నాయి. గత 20 రోజుల్లో సైన్యం జమ్మూ కశ్మీర్‌లో 15 ఆపరేషన్లు నిర్వహించింది. ఆయా ఆపరేషన్లలో ఏడుగురు పాక్‌కు చెందిన ఉగ్రవాదులతో సహా మొత్తం 27 మంది హతమయ్యారు. లష్కరే తోబాయికు చెందిన 19 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సైనిక అధికారులు తెలిపేరు..