ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల అరెస్ట్..ఏకే-56,ఐఈడీ, గ్రెనేడ్లు స్వాధీనం..

నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల సహచరులను భద్రతా బలగాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……
జమ్మూ కాశ్మీర్ లోని క్రాల్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న వ్యక్తులు ఉన్నారని,ఆ ప్రదేశంలో హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌ఎం) ఉగ్రవాద కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయని మిలటరీ ఇంటెలిజెన్స్,ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి కుప్వారా జిల్లా పోలీసులకు,ఇండియన్ ఆర్మీకి విశ్వసనీయ సమాచారం అందింది. వీరంతా ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని కల్పించడంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, అలాగే ఇతర అవసరమైన లాజిస్టిక్ లను కూడా అందజేస్తున్నారని తెలిసింది.ఈ సమాచారం ఆధారంగా జమ్మూకాశ్మీర్ పోలీసులు,ఇండియన్ ఆర్మీ జాయింట్ టీం గా ఏర్పడి ముగ్గురు తీవ్రవాద సహచరులను పట్టుకున్నాయి.వారిని క్రల్‌పోరాలోని దర్ద్‌సన్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రౌఫ్ మాలిక్,అల్తాఫ్ అహ్మద్ పేయర్‌గా గుర్తించారు.మరొకరు క్రాల్‌పోరా ప్రాంతానికి చెందిన రియాజ్ అహ్మద్ లోన్ అని పోలీసులు పేర్కొన్నారు.