కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురుచూడాలి… ఉగ్రవాదుల హెచ్చరికలు..!!!

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల అల్ ఖైదా ఆగ్రహం...

నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు భారత్ లోనే కాదు, అంతర్జాతీయంగానూ ప్రకంపనలకు కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే ఖండించగా, తాజాగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా స్పందించింది. ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఆత్మాహుతి దాడులు చేపడతామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడడం కోసమే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్ ఖైదా ఓ లేఖ విడుదల చేసింది..మా ప్రవక్తను కించపరిచిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, దేహాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవంలేనివారిని పేల్చిపారేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురుచూడాలి” అంటూ లేఖలో పేర్కొన్నారు,..