ఇప్పటికే ‘మిషన్ – 2024’లో భాగంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు (ind vs sl 2023) హార్దిక్ పాండ్య సారథ్యం వహించాడు. జట్టును విజేతగా నిలిపాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌ను రోహిత్ (rohit sharma) వదిలేసినట్లేనా..? అనే ప్రశ్న తలెత్తడంతో.. దానికి హిట్‌మ్యాన్ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే టెస్టులు, వన్డే జట్టుకు తన తర్వాత ఎవరు బాధ్యతలు తీసుకొంటారనే చర్చపైనా రోహిత్ స్పందించాడు. బంగ్లాతో వన్డే సిరీస్ సందర్భంగా వేలికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకొని లంకతో సిరీస్‌కు సిద్ధమైపోయాడు..భవిష్యత్ కెప్టెన్ గురించి ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. మనం ఇప్పుడు వన్డే ప్రపంచకప్ సంవత్సరంలో ఉన్నాం. మా దృష్టంతా వరల్డ్ కప్‌పైనే ఉంది. అలాగే ఈ ఏడాదే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఉంటుంది. దాని కోసం టెస్టులను ఆడాల్సి ఉంది. అందుకే వేచి చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నా. నేనేమీ టీ20లను వదిలేయడం లేదు. సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడం మాత్రమే జరిగింది. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని కొందరికి మూడు ఫార్మాట్లు ఆడటం కుదరకపోవచ్చు. షెడ్యూల్‌ను చూస్తే వరుసగా మ్యాచ్‌లు ఉంటాయి…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.