కొత్త వాహనాలకే ‘TG’తో రిజిస్ట్రేషన్‌?…

హైదరాబాద్:ఫిబ్రవరి..

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవలే కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రాష్ట్ర రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ కేంద్ర రవాణా శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు ‘టీజీ’తో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అందుకు వారం, పది రోజులు పడుతుందని రవాణాశాఖ వర్గాలు అంటున్నాయి…

వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను TS నుంచి TGగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది…ఈ క్ర‌మంలో తమ పాత వాహనాలపై ఉన్న నంబర్ ప్లేట్ల సంగతి ఏంటనే సందేహం వాహనదారుల్లో మొదలైంది.
అయితే TS నుంచి TGగా మారే ప్రక్రియ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కే పరిమితం అవుతుంద‌ని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు…ఇప్పటికే రిజిస్టర్‌ అయిన వాటికి TS కొనసాగు తుంద‌ని తెలిపారు. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చాకే TGతో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవు తాయన్నారు…