భారతీయులకు థాయ్‌లాండ్ సర్కార్ బంపర్ ఆఫర్….భారత్‌, తైవాన్‌ దేశాలవారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజులపాటు పర్యటించేందుకు అనుమతి..!

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, తైవాన్‌ దేశాలవారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజులపాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది…

ఈ సందర్భంగా థాయ్ అధికార ప్రతినిధి చాయ్ పచరొంకే మీడియాతో మాట్లాడుతూ.. భారత్, తైవాన్ నుంచి వచ్చేవారు వీసా లేకుండానే దాదాపు 30 రోజులపాటు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చనని తెలిపారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, పర్యటక రంగాన్ని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. థాయిలాండ్ లో పర్యటించే వారిలో మలేషియా, చైనా, దక్షిణ కొరియా దేశీయులు మొదటి మూడు స్థానాల్లో నిలువుగా .. నాల్గొవ స్థానంలో భారత్ నిలించింది. కాగా.. ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి థాయ్‌లాండ్ ఇప్పటికే సెప్టెంబరులో చైనీస్ పర్యాటకులకు వీసా మినహాయింపును ఇచ్చింది.

. ఈ క్రమంలో పర్యటక రంగం నుంచి ఆ దేశానికి దాదాపు 25.67 బిలియన్ అమెరికన్ డాలర్ ఆదాయం చేకూరింది. ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ చైన్‌లు ఆ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడంతో భారతదేశం నుండి ఇన్‌బౌండ్ టూరిజం వృద్ధి సంకేతాలను చూపించిందనీ, థాయ్‌లాండ్ ఈ సంవత్సరం సుమారు 28 మిలియన్ల పర్యటకులు తమ దేశంలో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. థాయ్ కొత్త ప్రభుత్వం ప్రయాణ రంగం ఆర్థిక వృద్ధిని నిరోధించే బలహీన ఎగుమతులను భర్తీ చేయగలదని ఆశిస్తోంది..

నవంబరు 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ సడలింపు ఇవ్వనుంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయ్‌లాండ్‌ కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని శ్రేట్టా థవిసిన్‌ తెలిపారు. గత నెలలో చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయ్‌లాండ్‌ వీసా మినహాయింపును ఇచ్చింది. మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్‌ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌కు వెళ్తుంటారు. కొద్దిరోజుల క్రితం శ్రీలంక భారత్‌ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది.